తెలుగు గళం న్యూస్, మిడుతూరు, రిపోర్టర్ – మల్లికార్జున.హాకీ మాంత్రికుడు మేజర్ ద్యాన్ చంద్ పుట్టినరోజు సందర్బంగా మిడుతూరు నందు గల లక్ష్య స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను పాఠశాల కరాస్పాండెంట్ ఎమ్.మహేంద్ర ద్యాన్ చంద్ చిత్ర పటానికి పూలమాల వేసి, విద్యార్థుల కు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రతి విద్యార్ధి క్రీడా పటవాలను విద్యార్ధి దశనుంచే నేర్చుకోవాలన్నారు. క్రీడాల ద్వారా మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం పెంపొందించుకోవచన్నారు. అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను అందించారు. ఈ సందర్బంగా లక్ష్య స్కూల్ కరాస్పాండెంట్ ఎమ్.మహేంద్ర మాట్లాడుతూ లక్ష్య స్కూల్ నందు విద్యార్థులకు చదువు తో పాటు క్రీడాలను కూడా ప్రోత్సహిస్తున్నామని,పలు విద్యార్థులు కూడా క్రీడారంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో పిఈటి రంగనాయకులు, ఉపాధ్యాయులు పీరా, వెంకటేష్ నాయక్, సురేంద్ర,స్వప్న,దయ,అతిర,ఉష,వీణ, ఆన్సీ, నందిని, శిరీష, మున్వర్ బేగం, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.