
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ న్యూ శాయంపేట జంక్షన్ వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, ఇతర అధికారులు, కుల సంఘాల నాయకులు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాచిదేవ ట్రస్ట్ భవనంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పూలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కుల సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.