ఘనంగా సంక్రాంతి సంబరాలు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల దుద్దెపూడి గ్రామ సర్పంచ్ మోరంపూడి అనసూయ కుమారుడు మోరంపూడి శ్రీదర్ బాబు ఉప సర్పంచ్ ల ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సంక్రాంతి సంబరాలలో దుద్దెపూడి గ్రామ ప్రజలు పిల్లలు,పెద్దలు ఉత్సాహంగా రాజకీయాలకతీతంగా పాల్గొంటున్నారు.ఈ సంబరాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లల పెద్దలకు కబడ్డీ పోటీలు, స్త్రీల, పురుషులకు బెలూన్ వాక్ పోటీలు ,100 మీటర్ల పరుగు పందెం పోటీలు జరుగుతున్నాయి.ఆదివారం ముగ్గుల పోటీలు,మరియు బెలూన్ వాక్ జరుగుతుండగా సోమవారం,మంగళవారం కబడ్డీ పోటీలు,పరుగు పందెం పోటీలు జరగనున్నాయి.ఈ సంబరాలలో ఇప్పటికే సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుండి గ్రామానికి వచ్చిన వారంతా ఈ సంక్రాంతి సంబరాలలో సంతోషంతో పాల్గొంటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎప్పుడు ఇలాంటి సంక్రాంతి సంబరాలు తమ పల్లెలో ఎన్నడూ జరగలేదని ప్రజలు అంటున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ ల ఆధ్వర్యంలో జరుగుతుండగా మార్పుకు శ్రీకారం చుట్టినట్లు ఉందని పెద్దలు అభినందిస్తున్నారు. దుద్ధేపూడి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువతీ, యువకులు,పిల్లలు,పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.