
ఘనంగా 130వ ఐలమ్మ జయంతి వేడుకలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చిట్యాల ఐలమ్మ 130వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తాటికొండ గ్రామ పంచాయతీ వద్ద రజక వృత్తిదారుల సంఘం మండల నాయకులు అక్కినపల్లి డ్రైవర్ వెంకటయ్య,అక్కినపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో అక్కినపల్లి వీరయ్య, రామ్మూర్తి,యాదగిరి,ఐలోని సుధాకర్‌తో పాటు పలువురు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.మోడల్ కాలనీలో మండల గౌరవ అధ్యక్షులు అక్కినపల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు.ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి యాకుబ్ పాషా,ఆమరాజు,బాబు,శ్రీధర్,సతీష్,డాక్టర్ రాజేశ్వర్,మచ్చ బిక్షపతి,గట్టయ్య,అక్కినపల్లి సాయి,విజయ్,సుందర్ సింగ్,హిరాసింగ్,రాజు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.ఇప్పగూడెంలో జరిగిన వేడుకలకు రజక వృత్తిదారుల సంఘం మండల కార్యదర్శి పద్మాకర్, గ్రామ కార్యదర్శి భానుచందర్,రఘురాముడు,వెంకటయ్య,కారోబార్ శ్రీనివాస్,సాంబయ్య,కొండయ్య,రాజశేఖర్,రవి,అశోక్ లతోపాటు పలువురు సంఘ నాయకులు హాజరయ్యారు.