
ఈ69న్యూస్ వర్ధన్నపేట డిసెంబర్ 05
వరంగల్ జిల్లా రూరల్ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుకున్న 1991-92 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం తాము చదువుకున్న పాఠశాలలో ఒక్కటై కలుసుకున్నారు.వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.దాదాపు 32 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా గడిపారు పోటాపోటీగా ఫోటోలు సెల్ఫీలు తీసుకొని
ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ఉపాధ్యాయులు అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులను చూసి గర్వంగా ఉందని అభినందించారు.అనంతరం పూర్వ విద్యార్థులు తమకు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులైన అందరికీ ఘనంగా సన్మానించి ఆశీర్వాదము తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వర్ధన్నపేట గ్రామానికి చెందిన చంద్రకళ,కొండేటి శ్రీనివాస్, సదానందం,ఫయాజ్,ఎల్లగౌడ్,రవి,వీరమ్మ,నవీన్, హరిదాస్,రాజేందర్, కాంతం,కె.శ్రీనివాస్,కృష్ణవేణి,జాన్షీరాణి,సుజాత,చంద్రశేఖర్,కొండూరు గ్రామానికీ చెందిన ఎండి గుంశావలీ(ఇక్బాల్)ప్రవీన్,సోమయ్య,హరినాద్,కిషన్ రావు,పున్నేల్ జిల్లాబాబు,వడ్లకొండ గ్రామానికి చెందిన ఏలియ,రాంనాథ్ తండ కిషన్ నాయక్,సింగారం ప్రేమ్ కుమార్,బి పాల్ సింగ్(పాలకుర్తి ఎమ్మార్వో)అరుణ, తదితరులు పాల్గొన్నారు.