జండాను ఆవిష్కరించిన తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పాతూరి వెంకట రావు షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో గల ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రముఖ పౌల్ట్రీ పారిశ్రామిక వేత్త తెరాస రాష్ట్ర నేత, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పాతూరి వెంకట రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరం ఐక్యంగా దేశ సమైక్యత కోసం కృషి చేయాలని, ఐక్యతను కొనసాగించాలని కోరారు..అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, పి ఎ సి డైరెక్టర్ పాండురంగ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ షాద్ నగర్ అధ్యక్షులు గుదే వసంతరావు, పౌల్ట్రీ రైతులు పాతూరి బ్రహ్మయ్య, పాతూరి సత్యనారాయణ, బండారుపల్లి నాగేశ్వర రావు, మాకినేని వెంకట నారాయణ, కుకట్ల సత్యనారాయణ, గుదే మస్తాన్ రావు, పూర్ణ, ఆలూరి శ్రీను, సంజీవ రావు, మక్కపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు