చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి….
Adilabadషీ టీం ఇంచార్జ్ ఏ.ఎస్.ఐ. సునీత//
ఆడ పిల్లలు, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయ్ అని వాటిపై అవగాహన ప్రతి ఒక్కరికి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని షీ టీమ్ ఇంచెస్ ఏ ఎస్ఐ సునీత అన్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల అదిలాబాద్ యందు విద్యార్థులకు కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జ్ ఏ ఎస్ఐ సునీత మాట్లాడుతూ. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేసిన వెంటనే భయపడకుండా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు . జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మరియు అడిసినల్ ఎస్పీ శ్రీనివాస్ రావ్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సైబర్ నేరాలు, 1930 నంబర్ బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, క్యూఆర్ కోడ్, ఫోక్స్ యాక్ట్, చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బందులకు గురైన వెంటనేshe team నెంబర్ 8712659953 ఫోన్.చేయాలి అని ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ ఉషన్న, ఐ టి కోర్ రియాజ్, హెడ్ క నిస్టేబుల్ అశోక్ రావు స్కూల్ ప్రిన్సిపాల్ ,బోధన ఉపాధ్యాయ , బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.