
చదువుకున్న పాఠశాలకు సహకరించడం ఎంతో గోప్ప విషయమని ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. గురువారం మండలంలోని
శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1969 లో విద్య నభ్యసించిన పూర్వ విద్యార్ది, ప్రముఖ డాక్టర్ పాలడుగు రాంబాబు చర్మవ్యాధి నిపుణులు,విజయవాడ తన తల్లిదండ్రులైన పాలడుగు వెంకట సుబ్బమాంబ,వెంకట కోటేశ్వరరావు ల జ్ఞాపకార్ధం పాఠశాలకు 30 వేల విలువైన రెండు బీరువాలు,కంప్యూటర్ టేబుల్,ఎలక్ట్రానిక్ సామాగ్రిని బహూకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐదున్నర దశాబ్దాల క్రితం తాను చదువుకున్న పాఠశాలను మరువకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు.కాగా 1969లో పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇటీవలే ఆత్మీయ సమ్మేళనం జరుపుకుని పాఠశాల అభివృద్దికొఱకు పాటుబడాలని తీసుకున్న నిర్ణయం లో భాగంగా తన వంతుగా విరాళమిచ్చినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. ఈ సందర్బంగా దాతను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం శోభన్ బాబు,సామినేని శ్రీనివాసరావు, మిరాజుద్దీన్,సుబ్రహ్మణ్యం,యం డి మౌలానా,బత్తిని శ్రీనివాసరావు, అహల్యాదేవి,పర్వతాలు,సత్యనారాయణ,
లలితకుమారి, సత్యం తదితరులు పాల్గొన్నారు….