చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సమాచార హక్కు చట్టం కమిటీ సభ్యులు
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్.బి నగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మెరిసే విప్లవ ధ్రువతార.. దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది. తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించింది. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్” చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు పాల్గొన్నారు.