
ఈరోజు సారపాక టౌన్ BRS పార్టీ కార్యాలయం లో టౌన్ ప్రెసిడెంట్ కొనకనుంచి శీను, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, మరియు నిమ్మల వెంకటేశ్వర్లు, గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల (చాకలి) ఐలమ్మ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఐలమ్మ గారు ఒక సాధారణ మహిళగా పోరాటం చేసారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ గారి పోరాటానికి త్యాగానికి గుర్తుగా వారి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారికంగా ప్రకటించింది, ఈ గడ్డపై భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారు అన్నారు, ఆడబిడ్డకు స్ఫూర్తి సాకలి నిలిచిన ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ వీరవనితకు ఘన నివాళులు అర్పించినరు.
ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గారు, మండల మైనార్టీస్ సేల్ అధ్యక్షుడు సాధిక్ భాష, టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోమలక్ష్మి చైతన్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉపాధ్యక్షుడు సట్టు ఆంజనేయులు, మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత, మండల నాయకులు చుకుపల్లి బాలాజీ, బిట్ర సాయి బాబా, మేకల సతీష్, బాలి శ్రీహరి, బెజ్జంకి కనకాచారి, రెడ్డిపోగు రవి ఈశ్వర్, శివరామకృష్ణ, పంగి సురేష్, గొడ్ల రాజు, జీనుగు దాసు, ధార నరసింహారావు, కవులూరి వీరయ్య, నిమ్మల వెంకటేశ్వర్లు, చంద్రరావు, మాజీ ఎంపీటీసీ దాసరి వెంకటరమణ, పాలకొల్లు సత్యవతి, రమణమ్మ, తదితర పార్టీ నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు*