చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
Hyderabadనాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ములచింతల పల్లెలోని చెంచు గూడెం భ్రమరాంబ కాలనీలో నివాసంముంటున్న చెంచు ఈశ్వరమ్మ పై అమానుష ఆత్యాచారం చేసి మానంలో కారం పోసి నానా రకాల చిత్రహింసలకు గురి చేసిన బండి వెంకటేష్ యాదవ్ అతని భార్య తన తమ్ముడు ముగ్గురు దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఈశ్వరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కెవిపిఎస్ నగర నాయకులు బి పవన్ లు డిమాండ్ చేశారు
శనివారం నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న చెంచు ఈశ్వరమ్మను వారు పరామర్శించి ధైర్యం చెప్పారు వారు మాట్లాడుతూ రోజురోజుకీ దళితులు ఆదివాసి గిరిజనులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు చెంచు మహిళా ఈశ్వరమ్మ వద్ద ఉన్న భూమిని లాక్కునేందుకు ప్రయత్నించిన బండి వెంకటేష్ యాదవ్ ఎదిరించినందుకే ఈ అత్యాచారానికి ఒడిగట్టారని చెప్పారు బండి వెంకటేష్ భార్య ఈశ్వరమ్మ పై మానంలో కారం చల్లి నడి రోడ్డుపైనే అమానుషానికి పాల్పడిందన్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసి చెంచుగ్రామాల్లో పెత్తందారుల దాస్టికాలు రోజురోజుకి పెరుగుతున్నాయని తమ భూములు లాక్కోవాలని చూస్తే ప్రతిఘటించడం వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు చెంచు మహిళా ఈశ్వరమ్మ తన ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ధీనావస్థలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులు బండి వెంకటేశ్ యాదవ్ అతని భార్య తమ్ముడు ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం తో పాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలన్నారు ఈశ్వరమ్మకి మెరుగైన వైద్యం అందించాలని ఈశ్వరమ్మ పిల్లల చదువులు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆ పెత్తందారులను కఠినంగా శిక్షించి రాష్ట్రంలో మరో ఘటన జరగకుండా చూడాలని వారు పోలీసుఉన్నతాధికారులను డిమాండ్ చేశారు