


ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు విరివిగా నాటి వాతావరణాన్ని కాపాడాలని, కాలుష్య రహిత వాతావరణాన్ని రాబోయే తరాలకు బహుమానంగా అందించడానికి అందరూ కృషి చేయాలని ఎస్సై సాకపురం దివ్య ప్రజలకు పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని నిజాంపల్లి గ్రామంలో ప్రజలతో కలిసి ఎస్సై మొక్కలు నాటారు. మొక్కలు నాటడం మే కాదు వాటిని సంరక్షించి ఊరిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి అందరూ తమ వంతుగా ప్రయత్నం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలు పెంచడం ద్వారా వాతావరణం లో మార్పులు జరిగి సమతుల్యత పెరిగి వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ప్రతి వీధిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని, అలాగే ప్రతి ఇంటిలో పండ్ల మొక్కలు విరివిగా పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, రసాయనాలు కలిపిన పండ్లను తినడం ద్వారా మన చేతులతో మనమే మన ఆరోగ్యం గాలికి వదిలేస్తున్నామని తద్వారా మనిషి యొక్క జీవించే కాలం క్రమంగా తగ్గుతుందని ఎస్సై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలో ని సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.గ్రామస్తులు ఎలాంటి సమస్య ఉన్న ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుల సహకారం తీసుకోవచ్చని ఎస్సై ప్రజలకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సై,గ్రామస్తులు,పోలీస్ సిబ్బంది పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు.
అనంతరం ఎస్సై బాలయ్యపల్లి లో ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సీఐ మల్లేష్ యాదవ్ గ్రామానికి చెందిన యువకుడు తోట్ల తిరుపతి సహకారంతో సి సి కెమెరాలు ఏర్పాటు చేయగా, ఎస్సై వాటిని సందర్శించి, వాటి యొక్క పనితీరును పరిశీలించారు.