
telugu galam news e69news local news daily news today news
తెలంగాణ- చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం మరియు ధర్మారం సిఆర్పీఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు.అక్కడ అధికారులను సరిహద్దు ఏజెన్సీ గ్రామాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల నిషేధిత సిపిఐ మావోయిస్టులు దాడికి పాల్పడిన ధర్మారం క్యాంపును సందర్శించారు.ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మావోయిస్టుల దాడిని పోరాటపటిమతో ఎదుర్కొని,వారి కుట్రను భగ్నం చేసిన సిఆర్పీఫ్ అధికారులు మరియు సిబ్బందిని ప్రశాంశించారు.క్యాంపుల నందు విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపారు.