
telugu galam news e69news nadigudeam news
నడిగూడెం, జనవరి 16, గళం న్యూస్:
చేపల పెంపక దారులను బెదిరించిన విలేకరుల పై కేసు నమోదు అయినా సంఘటన నడిగూడెం మండల కేంద్రం లో చోటు చేసుకుంది.మండల ఎస్. ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం లోని
రత్నవరం గ్రామానికి చెందిన మిర్యాల ఆంజనేయులు,మిర్యాల గురుస్వామి అనే వ్యక్తులను శానార్తి తెలంగాణ,జనం సాక్షి కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ రిపోర్టర్ లు రవి, రామకృష్ణ లు మా పత్రిక లకు యాడ్ ఇవ్వాలి లేదా మాకు కొంత డబ్బు ఇవ్వాలని లేకపోతే సంబంధిత జిల్లా అధికారులకు చెప్పి కేసులు చేపిస్తామని బెదిరించారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం తో విచారణ చేసి ఆ ఇద్దరు విలేకరుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్. ఐ తెలిపారు.