
ఈ69న్యూస్:జనగామ జిల్లా వ్యాప్తంగా గురువారం (25-09-2025) విస్తారంగా వర్షాలు కురిశాయి.మాన్యువల్ రైన్గేజ్ ల ప్రకారం జిల్లా మొత్తంలో 523.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.జిల్లా సగటు వర్షపాతం 43.6 మిల్లీమీటర్లు గా నమోదైంది.జఫర్గఢ్ మండలంలో అత్యధికంగా 106.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.దేవరుప్పుల మండలంలో 71.6 మిల్లీమీటర్లు,పాలకుర్తి మండలంలో 68.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యాయి.తక్కువగా కోడకండ్ల మండలంలో కేవలం 8.6 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది.మిగతా మండలాల్లో 22 నుండి 44 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.