జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించిన నాయిని
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించిన నాయిని…
- దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలి, దేశాన్ని ఆదానీ బారి నుంచి కాపాడుకుందాం.. హన్మకొండ డిసిసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో నాయిని..
1.హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
అధిష్టానం పలుమార్లు హెచ్చరించిన, అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి, ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా విస్మరించినందున “జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది.”
హన్మకొండ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇతనికి సహకరించిన యెడల వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోబడుతాయని ఈ ఆదేశాలు తక్షణమే అమలు లోకి వస్తాయని అన్నారు.
అదేవిధంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ను మరియు హన్మకొండ జిల్లా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పేరిట, పాదయాత్ర పేరిట జంగా రాఘవ రెడ్డి పర్మిషన్ల కొరకు అప్లై చేసిన యెడల అతనికి కాంగ్రెస్ పార్టీ తో ఎటువంటి సంభందం లేదు అని తెలియ చేయడం జరుగుతుంది.
టిపిసిసి క్రమశిక్షణ సంఘం తేది 26-07-2021 రోజున జిల్లా అద్యక్షులైన (నాయిని రాజేందర్ రెడ్డి మరియు జంగా రాఘవ రెడ్డి)లను సమావేశపరిచి మరియు వారితో మాట్లాడి, భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా సూచనలు చేయడం జరిగింది.
అయినప్పటికీ జంగా రాఘవ రెడ్డిలో మార్పు రాలేదు. తదనుగుణంగా తనపై తదుపరి చర్యలు చేపట్టడం జరిగింది.
పై విషయమై హెచ్చరించినప్పటికి మార్పు రాకపోవడం వలను టిపిసిసి క్రమశిక్షణ సంఘం జంగా రాఘవ రెడ్డికి తేది 02-05-2022 రోజున షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.
జంగా రాఘవ రెడ్డికి గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన షోకాజ్ నోటీసును విస్మరించి, అధిష్టానం పలుమార్లు హెచ్చరించిన అవేమి పట్టించుకోకుండా హన్మకొండ జిల్లాలో తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, నాపై (నాయిని రాజేందర్ రెడ్డి) అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఐకమత్యానికి విఘాతం కల్గిస్తు, పార్టీ పరువు తీస్తూ, ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకుర్చేవిదంగా వ్యవహరిస్తూ, అధిష్టానం ఆదేశాలను ధిక్కరించినందుకు “జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడం జరిగిందని, ఇతనికి ఎవరు సహకరించిన కూడా వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోబడుతాయని అన్నారు.
రాటిఫికేషన్ క్రింద అధిష్టానానికి పంపించడం జరిగింది.
2.ఏఐసిసి/టిపిసిసి ఆదేశాల మేరకు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ లో ఎంపీగా అనర్హత వేటు వేసిన అంశంపైన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
దేశంలో ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారునాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని, నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.
ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని తెలిపారు.
మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ ను అడ్డుకున్నారని గుర్తు చేశారు.
పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని చెప్పారు.
తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆదానీ-ప్రధాని అని విమర్శించారు. ఆదానీ ఇంజన్ కు రిపేరు వచ్చిందని ప్రధానికి భయం పట్టుకుందన్నారు.
మొత్తం దేశ సంపదను దోచుకొని ఒక వ్యక్తికీ కట్టబెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక దాని తర్వాత ఒకటిగా అమ్మేస్తున్నారు.
ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయందోలనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారు.
ప్రధానమంత్రి, కేబినేట్ మంత్రులు, మొత్తం వ్యవస్థ కలిసి ఒక వ్యక్తిని కాపాడటానికి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తున్నరనేది ప్రజలు ఆలోచించాలి
పప్పు అని అవహేళన చేసిన బీజేపీకి రాహుల్ నిప్పు అని తెలుసుకున్నారని… అందుకే రాజకీయ కక్షతో రాహుల్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారని ఆరోపించారు.
ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్ గాంధీని చూసి మోదీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోందన్నారు.
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ & పిసిసి సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ, AIPC అద్యక్షులు డాక్టర్ పులి అనిల్ కుమార్, ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, నాయకులు తౌటం రవీందర్, పులి రాజు, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఇప్పా శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా నాయకులు మహమ్మద్ అంకుష్, మేకల ఉపేందర్, MV సమత రాజు, నాగపురి లలిత, బొంత సారంగం, గుంటి స్వప్న, నాయకులు బంక సంపత్, అంబేద్కర్ రాజు, అరూరి సాంబయ్య, కొండా శివ, క్రాంతి భరత్, రంగు సుదీర్, డివిజన్ అద్యక్షులు, మండల పార్టీ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.