జక్కలొద్ది రామ్ సురేందర్ నగర్ లో ఘనంగా కొండా సుస్మిత పటేల్ జన్మదిన వేడుకలు ఈ69న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు కూతురు కొండా సుష్మిత పటేల్ పుట్టిన రోజు వేడుకలు ఖిల్లా వరంగల్ మండలం జక్కలొద్దీ గ్రామం రామ సురేందర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలకోటి శ్యామ్,సోషల్ మీడియా ఇంచార్జ్ గజ్జ చందు మాట్లాడుతూ..కొండా దంపతుల కూతురు కొండా సుష్మిత పటేల్ పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీకీ బడుగు బలహీన వర్గాలకు తోడ్పాటును అందించే చరిత్ర ఉందని అన్నారు.రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో అనేక సంక్షేమ పతకాలు పేదలకు అందించే విదంగా కృషి చేస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మైదం వినోద,దుప్పటి రమ్య,రేణుకుంట్ల చెందర్,పుట్ట అనీల్,కోటేశ్వర్,లక్ష్మణ్,ఎంబడి వెంకటేశ్వర్లు,రమణ,చిరంజీవి,మహేష్,ఎండీ అబ్రాన్ కాంగ్రెస్ కార్యకర్తలు కొండా అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.