మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
-మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
తెలుగుగళం న్యూస్, బుక్కరాయసముద్రం, రిపోర్టర్ – తులసిరామ్
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్థుల మధ్యాహ్న భోజన సమయానికి ఎవ్వరికీ తెలియకుండా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హై స్కూల్ కు వచ్చారు. వచ్చి రాగానే భోజనాల వద్దకు నేరుగా వచ్చి, భోజన పాత్రలలో అన్నం, కూరలు పరిశీలించారు. భోజన వంటల పై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఆదేశించారు. లేదంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత భోజనాలు చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి, పలు విషయాలు మాట్లాడారు. భోజనాలు గురించే గాకుండా, విద్యా బోధన విషయాలు, సమస్యలు పై అడిగారు.ఆతర్వాతఆర్.డబ్ల్యు.యస్. అధికారులు ను పిలిపించి, విద్యార్థులు త్రాగుతున్న నీటి గురించి పరీక్షలు జరిపించారు. అధికారులు త్రాగునీటి వాడకం పై ఎలాంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారికి తెలిపారు.ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోడల వరకు నిర్మించి, నిలిపివేసిన భోజన శాల ను పరిశీలించారు. భోజన శాల ను విద్యార్థులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.హై స్కూలు యందు అబ్బాయిలకు,ఉపాద్యాయులుకు టాయిలెట్స్ లేకపోవడంతో వెంటనే సంబంధించిన అధికారులు కు రిపోర్ట్ చేయాలని హెడ్ మాస్టర్ కు సూచించారు.అలాగే టీచర్ల కొరత గురించి ఉపాద్యాయులు ను అడిగారు. త్వరలోనే హిందీ టీచర్ రిటైర్డ్ అవుతారని, హిందీ టీచర్ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కి వినతి చేశారు. జిల్లా విద్యా శాఖాధికారి కి లేఖ వ్రాయాలని, అలాగే టీచర్ల, ఇతర సమస్యల గురించి ఒక రిపోర్ట్ కాపీ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఉపాద్యాయులు కు సూచించారు.