ఈ69 న్యూస్ జనగామ ఎన్ఎస్పీసి ఏకోమిత్ర జాతీయ స్థాయి పరీక్షలో దేశంలో మొదటి స్థానం ఇటీవల నిర్వహించిన ఎన్ఎస్పీసి ఏకోమిత్ర జాతీయ స్థాయి పరీక్షలో జనగాం జిల్లా దేశవ్యాప్తంగా మొదటి స్థానం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా విద్యా వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.అలాగే,తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్),జఫర్గడ్ విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు.10వ తరగతి విద్యార్థినులు ఎ.హారిక మరియు టి.సహస్ర ఎన్ఎస్పీసి పరీక్షలో తెలంగాణ మెరిట్ జాబితాలో స్థానం సంపాదించడం ద్వారా తమ విద్యా సంస్థ,జిల్లా మరియు రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు.విద్యార్థినుల కృషి,ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం,తల్లిదండ్రుల సహకారం ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని విద్యా శాఖ అధికారులు అభినందించారు.