జనగామ అంబేద్కర్ సెంటర్లో సిపిఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో భారీ నిరసన
Uncategorized
ఈ69న్యూస్ జనగామ
సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని అక్రమంగా విద్యార్థి నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లే కార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పాల్గొని మాట్లాడారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని ప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సమంజసం కాదన్నారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.విద్యార్థినేతలపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడం మానుకోవాలని అన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక తరగతుల నుండి పేద మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీలో విద్యను అభ్యసించేందుకు వెళుతున్న క్రమంలో విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించే కుట్రలో భాగంగా ఈ చర్యలకు పాల్పడుతుందని ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.కాలుష్యం కోరల్లో హైదరాబాద్ మహానగరం చిక్కుకోకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే అరుదైన వృక్షాలను కొట్టివేయకుండా భవిష్యత్ తరాల కోసం కాపాడుకుందాం అని అన్నారు.మానవ సమాజం మనుగడకు ఉపయోగపడే ప్రకృతి- జీవవైవిద్యాన్ని అర్థం చేసుకోలేని ప్రభుత్వ దమన కాండను ప్రతిఘటించాలని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
యూనివర్సిటీ భూములను అమ్మాలనే అనాలోచిత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి వెంటనే యూనివర్సిటీ భూముల్లో ఉన్న బుల్డోజర్లు జెసిబిలను బయటికి పంపాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి నాయకులను సిపిఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.సెంట్రల్ యూనివర్సిటీ భూముల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తూ ప్రకటన చేయకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య సింగారపు రమేష్ బొట్ల శేఖర్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సుంచు విజేందర్ భూక్య చందు నాయక్ మునిగేల రమేష్ చిట్యాల సోమన్న బిట్ల గణేష్ పార్టీ మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ మాచర్ల సారయ్య పార్టీ పట్టణ మండల నాయకులు కల్యాణ లింగం బాల్నే వెంకట మల్లయ్య పాము శ్రీకాంత్ పి కళ్యాణి బి ధర్మ బిక్షం నాయక్ అజ్మీర సురేష్ నాయక్ ఏదునూరి మదర్ నరసింహస్వామి లతాకుమారి తాండ్ర ఆనందం బ్లెస్సింగ్ టన్ పెద్ది సాయి ప్రసన్న భునాద్రి వెంకటాద్రి సుధాకర్ గాడి శివలింగం కచ్చ గళ్ళ వెంకటేష్ మున్నీర్ నామాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.