
జనగామ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ను కలిసిన ఆర్టీఐ సేవాసమితి నాయకులు

ఈ 69 న్యూస్ జనగామ
జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారా బత్తుల అనంతచారి ఆధ్వర్యంలో ఆర్టీఐ సేవాసమితి కమిటీ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ బి.రోహిత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు సమితి కార్యకలాపాల గురించి వివరించి,అనేక విషయాలపై చర్చించారు.ఈ సమావేశంలో జనగామ జిల్లా అధ్యక్షుడు జావిద్,నల్గొండ జిల్లా అధ్యక్షుడు పురాణపు సైదులు,వరంగల్ జిల్లా అధ్యక్షుడు గూడూరు ప్రణయ్ (స్టీఫెన్) పాల్గొన్నారు.