
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా....
జనగామ జిల్లాలో ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి జనగామ జిల్లాలో పంటల ఎనమరేషన్ చేపట్టాలి…..
ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోకపోవడం వల్లనే జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్న ఈ దుస్థితి
పాలక కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒకరిని ఒకరు నిందించుకోవడం కాకుండా కాకుండా అసెంబ్లీలో రైతాంగ సమస్యలపై చర్చించాలి…
జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రైతుల పంట పొలాలు అన్నకుండా తాగు సాగునీరు అందించే విధంగా తక్షణం చర్యలకు పూనుకోవాలి లేకుంటే రైతాంగాన్ని సమీకరించి ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తాం
జనగామ జిల్లాకు ఈనెల 16న వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఎండుతున్న పంటలను ఎనమరేషన్ చేసి నష్టపరిహారం అందించుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశింస్తు స్పష్టమైన ప్రకటన చేయాలి….
తక్షణం జిల్లాలోని రిజర్వాయర్లను దేవాదుల నీటితో నింపి చెరువుకుంటలను నింపాలి పెండింగ్ లో ఉన్న కాలువల పనులను పూర్తి చేయాలి….
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి…