
ఈ69న్యూస్ జనగామ:- జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతుండగా,మధ్యాహ్నం వేళ రోడ్లపై నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారుతోంది.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని,నీటిని ఎక్కువగా తీసుకోవాలని,తేలికపాటి వస్త్రాలు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.వృద్ధులు,చిన్నపిల్లలు,గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.