
జనగామ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులో వరంగల్-హైదరాబాద్ 163 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం యొక్క వివరాలు ఇలా ఉన్నాయి: వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు,ముందుగా వెళ్ళిన లారీని వేగంగా ఢీకొట్టింది.ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6గురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు అవవడంతో చికిత్స నిమిత్తం జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నుండి వచ్చిన వారు అని పోలీసులు గుర్తించారు.వీరు ప్రస్తుతం గాజుల రామారంలో నివాసం ఉంటున్నారని,ఏదో పనిమీద వరంగల్ కు వచ్చి తిరిగి వెళ్ళుతున్న క్రమంలో ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అనంతరం,కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ,ప్రమాదానికి కారణమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.