
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు నెల రోజుల పాటు కఠోర రంజాన్ ఉపవాసాలు పాటించి ఆదివారం నెల వంక చూసి ఉపవాసాలు విరమించకుని సోమవారం ఈదుల్ ఫితర్ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.జఫర్గడ్ మండల కేంద్రంతో పాటు ఉప్పుగల్,కూనూర్,సూరారం,తిమ్మంపేట,తమ్మడపల్లి జి,తీగారం,తమ్మడపల్లి ఐ తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు పండగను ఈద్ గా,మస్జిద్,లలో ప్రత్యేక నమాజులు చేసి ఘనంగా జరుపుకున్నారు.మౌల్వీలు ప్రత్యేక ప్రార్థనలు చేయించి రంజాన్ పండుగ విశిష్టత,ప్రాముఖ్యత గూర్చి వివరించారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ప్రత్యేక నమాజుకు ముందు పేదవారికి కోసం ఫిత్రాన ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం పెద్దలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.