
telugu galam news e69news local news daily news today news
హాజరుకానున్న బివి. రాఘవులు,తపన్ సేన్
జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు సీఐటీయూ జాతీయా వర్కింగ్ కమిటీ సమావేశాలు
జనవరి 31న వేయి స్తంభాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు మహా ప్రదర్శన..
సీఐటీయూ జాతీయ కార్యదర్శి పాలడుగు భాస్కర్ వెల్లడి
సిఐటియు జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు హనుమకొండలోని బాలవికాసలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జాతీయ కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు మంగళవారం హనుమకొండ రాంనగర్ లోని సుందరయ్య భవన్ లో విలేకరుల సమావేశం జరిగింది.
పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మొదటిసారి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు పోరాటాల గడ్డ హనుమకొండలో జరుగుతున్నాయని వీటిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు గడిచిన పది సంవత్సరాల కాలంలో బిజెపి అవలంబించిన విధానాలపై వర్కింగ్ కమిటీ సమావేశాలలో చర్చ జరుగుతుందని తెలిపారు దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతుందని చేద్దామంటే పని దొరకడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా ప్రభుత్వ రంగం మొత్తం ధ్వంసం అయిందన్నారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో విద్వేష మత రాజకీయాలతో దేశ ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన బిజెపి సంఘ్ పరివార్ సహకారంతో విద్వేషాలను ప్రేరేపించిందన్నారు దీంతో దేశ ప్రగతి అన్ని రంగాలలో తిరోగమిస్తుంది అని తెలిపారు విదేశీ స్వదేశీ బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ ఎనిమిది గంటల పని విధానానికి మంగళం పాడి 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చిందని కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు చేస్తుంటే ప్రధానమంత్రి పెట్టుబడిదారులకు అనుగుణంగా ఒకరోజు ఫ్లోర్ లెవెల్ వేతనం 178 రూపాయలను నిర్ణయించడం ప్రభుత్వం యొక్క వైఖరికి నిదర్శనంగా కనబడుతుందని తీవ్రంగా విమర్శించారు రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వర్గం దేశ ప్రజానీకం అనుసరించాల్సిన ఎత్తుగడలను ఈ వర్కింగ్ కమిటీ సమావేశాలలో చర్చిస్తామని అన్నారు జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా జనవరి 31న వేలాది మందితో కార్మిక మహా ప్రదర్శన నిర్వహిస్తామని అనంతరం పబ్లిక్ గార్డెన్ లో బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ హాజరవుతున్నారని కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు
ఈ విలేకరుల సమావేశంలో
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జే వెంకటేష్ రాగుల రమేష్ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు టీ ఉప్పలయ్య కాసు మాధవి గాదె ప్రభాకర్ రెడ్డి మెట్టు రవి జిల్లా ఆఫీస్ బెరర్స్ బొట్ల చక్రపాణి వేల్పుల సారంగపాణి పుల్ల అశోక్ యన్ రజిత పాల్గొన్నారు