గత సంవత్సరం వేలేరుపాడు గ్రామానికి చెందిన ఏపూరి కృపా అనే వ్యక్తి భూదేవి పేట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో మరణించడం జరిగింది ఇతనికి జనసేన సభ్యత్వం ఉండటం వలన ఆదివారం నాడు అతని కుటుంబ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజున కృపకు జనసేన ఇన్సూరెన్స్ ఐదు లక్షలు రావడానికి ప్రధాన కారణం వేలేరుపాడు జనసేన మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ అని ఆయనకెప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేలేరుపాడు జనసేన మండల్ అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ పాల్గొన్నారు