జనావాసాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించి వేరే చోటికి మార్చాలి.
Yadadri Bhuvanagiriసిపిఎం డిమాండ్
గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేత…~~
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో జనావాసాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వెంటనే అక్కడి నుంచి తొలగించి వేరే చోటికి మార్చాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు
గురువారం రోజున సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా జనావాసాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను సిపిఎం బృందం పరిశీలించింది, అనంతరం పంచాయతీ కార్యదర్శికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ గ్రామంలోని మూడో వార్డులోని మారెమ్మ పాటి ఏరియాలో బద్దం నర్సిరెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల పక్కన నూతనంగా ఇండ్లు నిర్మించడంతో అక్కడ ఉన్న ప్రజలకు దానివల్ల ప్రమాదం ఉందని గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో ఇండ్లు లేకపోయేవని ప్రస్తుతం ప్లాట్లు ఏర్పడి ఇండ్లను నిర్మించుకుంటున్నారని ఇప్పటికే గడ్డివాము విద్యుత్ షాకు తగిలి తగలబడి పోయిందని, ఒక మహిళకు కరెంట్ షాకు తగిలిందని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతంలోకి మార్చాలని డిమాండ్ చేశారు
అదేవిధంగా గ్రామంలో ఎస్సీ కాలనీలో పాడైపోయిన వాటర్ ఫిల్టర్ ను రిపేరింగ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామంలో బస్టాండు శిథిల వ్యవస్థ చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బస్టాండ్ ను రిపేరింగ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని పాత ఆంజనేయ గుడి ఏరియాలో వీసం పెద్ద వెంకయ్య ఇంటివద్ద ఒరిగిపోయిన స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని పర్రె బావి వద్ద విద్యుత్ లూజ్ లైన్ లను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను వేయాలని డిమాండ్ చేశారు
ఈ వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం శాఖ కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, నాయకులు మెట్టు రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లు ఆకుల మారయ్య, మాడుగుల వెంకటేశం, నాయకులు గోగు కిష్టయ్య, స్థానిక ప్రజలు బద్దం చంద్రారెడ్డి,ఆకుల బొందమ్మ, బద్దం ప్రేమలత, గుర్రం రాములమ్మ,మీసాల శ్రీహరి,శంకరయ్య,పల్లెర్ల శారద,ఏర్పుల అంజయ్య, మెట్టు సాయినాథ్ రెడ్డి,మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు