

ఈ69న్యూస్ జఫర్ఘడ్/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన సింగారపు బలరాములు (లేటు),సింగారపు ఉమాదేవి దంపతుల కుమార్తె డాక్టర్ సింగారపు అక్షిత,కాకతీయ మెడికల్ కాలేజీ,వరంగల్‌లో ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి,మంగళవారం జరిగిన కాన్వొకేషన్లో వైద్య డిగ్రీ పట్టా అందుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ అక్షిత మాట్లాడుతూ..“నా డాడీ కలను నెరవేర్చేందుకు నేను పట్టుదలగా చదివాను.మా కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు నా కళ్లముందు తాండవించేవి.ఆ కష్టాలు చూసి,మా తల్లి దండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలన్న లక్ష్యంతో నిరంతరంగా కృషి చేశాను.ఈ విజయానికి తోడ్పాటినందించిన మా డాడీ స్నేహితులకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను”అని తెలిపారు.”భవిష్యత్‌లో జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి,మా గ్రామానికి మరియు బీద ప్రజలకు సేవ చేయాలని నా ఆకాంక్ష,” అని తెలిపారు.జఫర్గడ్ గ్రామం నుంచి మొదటి మహిళా ఎం.బి.బి.ఎస్ డాక్టర్‌గా పట్టా పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.డాక్టర్ అక్షితను గ్రామస్తులు,బంధువులు,స్నేహితులు ఎంతో ఉత్సాహంగా అభినందించారు.