ఈ69న్యూస్ జఫర్ఘఢ్ సెప్టెంబర్ 01 జనగామ జిల్లా జఫర్గడ్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు (PACS) వద్ద ఉదయం 6 గంటల నుండేవర్షంలో తడుస్తూ రైతులు యూరియా కోసం క్యూలు కట్టారు.సాగు సీజన్లో ఎరువుల కొరత కారణంగా రైతులు తెల్లవారుజాము నుంచే బ్యాంకు వద్దకు చేరుకుని టోకెన్లు పొందేందుకు కష్టాలు పడుతున్నారు.వర్షంలో తడుస్తూ కూడా పొలాల పనులు ఆగకుండా సాగించేందుకు అవసరమైన ఎరువులు అందుకోవాలనే ఆత్రుతతో రైతులు బారులు తీశారు. ఎరువుల సరఫరా సకాలంలో జరిగి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల కోసం సమయానికి యూరియా సరఫరా కల్పించాలని స్థానికులు,వ్యవసాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.