
జనగామ జిల్లా జఫర్ గడ్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనం
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ గడ్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి.శనివారం మండల ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.అనంతరం మహిళా సంఘం అధ్యక్షురాలు అంచూరి కమల మాట్లాడుతూ..మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించాలని,పురుషుల కంటే మహిళలే అన్ని రంగాలలో రాణిస్తున్నారని వివరించారు.గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయి ఆత్మస్థైర్యంతో ఉన్న సునీతా విలియంను ప్రతి మహిళా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
దాంశెట్టి శ్రావ్యకు సన్మానం
ఇటీవల కర్ణాటకలోని శృంగేరీలో జరిగిన
701 భగవద్గీత శ్లోకాలపై జరిగిన పోటీలలో పాల్గొని 21వేల రూపాయల నగదు బహుమతి పొందిన జఫర్ గడ్ వాస్తవ్యురాలు దాంశెట్టి శ్రావ్యను
మహిళా సంఘాలు,అవోపా మండల శాఖ మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాలలో మహిళా సంఘం ప్రతినిధులు శ్రావ్య,దొడ్డ ఉమ,ధనమ్మ,సమత,అంబిక,స్వాతి,అనూష,భాగ్య,స్రవంతి,గీత,మాధవి,శ్రీదేవి,ప్రావీణ్య,మాధవి,విశాలి,స్వాతి తదితరులు పాల్గొన్నారు