
zaffergadh news e69news
జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్ గడ్ మేజర్ గ్రామపంచాయతీ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ చేర్మెన్ అన్నేబోయిన బిక్షపతి పాల్గొని లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.అలాగే 10 కౌంటర్లు ఏర్పాటు చేసి సుమారు గా 2000వేయిలా అభయహస్తం ఫామ్స్ ప్రజలకు ఇవ్వగా ఇప్పటి వరకు 1800 ఫామ్స్ ప్రజల నుండి స్వీకరించడం జరిగిందని అధికారులు తెలపారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ గ్రామశాఖ అధ్యక్షులు నీలం రాజయ్య మండల యువజన నాయకులు రడపాక దానియేలు వార్డ్ మెంబర్ కుక్కల ఎల్లయ్య మండల సీనియర్ నాయకులు మేరుగు ఎల్లగౌడ్ బొల్లె పరిశరాములు కుక్కల మొగిలి తదితరులు పాల్గొన్నారు.