
జఫర్ఘడ్ లో సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి
మనువాద వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపు
ఈ69న్యూస్ జఫర్ఘడ్
భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడారు.”భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని మళ్లీ తీసుకురావాలని బీజేపీ,ఆర్ఎస్ఎస్ నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ చర్యలు దేశ భవిష్యత్తుకు హానికరం,”అని ఆయన తీవ్రంగా విమర్శించారు.బి.ఆర్.అంబేద్కర్ ను”నవభారత దర్శకుడు,గొప్ప మేధావి,విద్యావేత్త,రాజీపడని పోరాటయోధుడు”గా అభివర్ణించిన జువారి రమేష్,”అంబేద్కర్ కార్మిక వర్గ హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన తొలి న్యాయశాఖ మంత్రి.కుల,మత భేదాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం కోసం ఆయన పోరాటం చేసినవారిలో అగ్రగణ్యుడు,అని అన్నారు.అంబేద్కర్ మనువాదానికి వ్యతిరేకంగా నిలబడి సమానత్వానికి మార్గం చూపారన్నారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి,కార్మిక వర్గాన్ని మితృ వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం తాకట్టు వేసింది,”అని విమర్శించారు.రిజర్వేషన్లను తొలగించేందుకు కుల,మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు.”మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ ప్రజలంతా ఉద్యమించాలి.అదే నిజమైన అంబేద్కర్ కు అర్పించే స్మరణ,అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మరియు కార్యదర్శులు యాకుబ్ పాషా,పెండ్యాల సమ్మయ్యనాయకులు,మంద బుచ్చయ్య,జాఫర్,సాయిలు,యాకయ్య,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.