
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈనెల 24న జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్లు జె ఎఫ్) జిల్లా మూడవ మహాసభలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు.కాగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్లు జె ఎఫ్) జిల్లా నూతన కమిటీ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ నాయకులకు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టులు
ప్రజలకు,ప్రభుత్వానికి వారదిగా ఉంటూ పనిచేయాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, అవినీతి అక్రమాలను వెలికి తీయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా వార్తలు రాయాలని సూచించారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్లు జె ఎఫ్) భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్,జిల్లా కార్యదర్శి గుజ్జ సారేశ్వర్ రావు,కోశాధికారి మండల రాంబాబు,జాయింట్ సెక్రటరీలు
సుంకరి శ్రీధర్,తూటీచర్ల దుర్గయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ప్రవీణ్ కుమార్,జిల్లా కార్యదర్శి బండి కమలాకర్,జిల్లా నాయకులు పుల్ల సృజన్ తదితరులు ఉన్నారు.