సియాసత్ ఉర్దూ దిన పత్రికలో మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి పట్ల ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నది. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది.జహీరుద్దీన్ అలీఖాన్ ఒక అభ్యుదయ వాదిగా లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం తన జీవితాంతం కృషి చేశారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద, నియంతృత్వ ప్రమాదాన్ని నిలువరించడానికి ఆయన అనేక ప్రజా సంఘాలతో, లౌకిక, వామపక్ష, ప్రజాస్వామిక, సామాజిక శక్తులతో కలిసి పనిచేశారు. అలాగే వివిధ విపత్తుల సందర్భంగా బాధితులకు, పేద ప్రజలకు సహకారం అందించేందుకు కృషి చేశారు. ఆయన మృతి లౌకిక, ప్రజాస్వామిక, సామాజిక శక్తులకు తీరని లోటు.