
జాతీయ దళిత సదస్సును జయప్రదం చేయండి.
రేపటినుండి ప్రారంభమయ్యే దళిత ఎజెండాపై జరిగే రెండు రోజుల జాతీయ సదస్సును జయప్రదం చేయగలరని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కార్యాలయంలో జరిగిన కెవిపిఎస్ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. 76 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో దళితులు నేటికీ అంటరాని వారిగా పూరి గుడిసెల్లో నివసిస్తూ తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, నేటికీ అనేకమంది దళితులకు సెంటు భూమి లేకుండా ఉన్నారు. దళిత వాళ్ళ అభివృద్ధి కి ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన ఉన్న రిజర్వేషన్లు దళితులకు దక్కక మరింత వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నాటునుండి దళితులపై దాడులు. అత్యాచారాలు. నగ్న ఊరేగింపులు పెరిగాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ.. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం వలన రిజర్వేషన్లు అందకుండా దళితులకు అన్యాయం చేస్తుంది. దళితులకు ఉపాధి కల్పనకై. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని. రాజ్యాంగ రక్షణకై. రాజ్యాంగంలోని హక్కులను సాధించుకొనుటకు ఈ యొక్క జాతీయ సదస్సు వేదికగా చర్చించనున్నట్లు తెలిపారు. యూజీసీ మాజీ చైర్మన్ థరూర్. మాజీ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ల నాయకత్వంలో హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్లాజాలో జరిగే ఈ సదస్సును ప్రజలు, కళాకారులు, మేధావులు, ఉద్యోగ, కార్మిక వర్గం తమ వంతు మద్దతు ఇవ్వాల్సిందిగా కెవిపిఎస్ హనుమకొండ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య. ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్. సహా కార్యదర్శులు. కనకం కావ్య శ్రీ. గడ్డం అశోక్. బోట్ల కుమార్. మామిడి రమేష్. హర్షం రామ్ కి. బొట్ల సారంగం పాల్గొన్నారు.