
telugu galam news e69news local news daily news today news
సవాళ్ల సమాజంలో బాలికలు మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా దిశానిర్దేశకులుగా రూపుదిద్దుకోవచ్చని కడియం ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.బుధవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ధర్మసాగర్ మండలం ముప్పారం లోని కస్తూరిబా బాలికల విద్యాలయం లో ఏర్పాటు చేసిన చైతన్య కార్యక్రమంలో డాక్టర్ కావ్య మాట్లాడారు..ప్రస్తుత సమాజంలో బాలికలు పుట్టుక నుంచీ పోరాటం చేయాల్సిన స్థితి నెలకొన్నదని స్వేఛ్చాయుత వాతావరణంలో వారు ఇప్పుడెదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలరని డాక్టర్ కావ్య అభిప్రాయ పడ్డారు. పాఠశాల విద్యా స్థాయిలోనే బాలికలు బాలురతో పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.మనదేశంలో బాలికా విద్య ప్రోత్సాహకరమైన రీతిలో ముందంజవేస్తున్నదని దీనికి తల్లిదండ్రులు మరింత చేదోడువాదోడుగా ఉండాలన్నారు.ధర్మసాగర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్, కేజీబీవీ ప్రిన్సిపాల్ మాధవి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.