జాతీయ మహాసభలకు ప్రతినిధిగా మూడ్ శోభన్ ఎన్నిక
Hyderabad*13 నుండి 16 వరకు కేరళ లోని త్రిస్సుర్ లో అఖిలభారత రైతు మహాసభలు..**జాతీయ మహాసభలకు ప్రతినిధిగా మూడ్ శోభన్ ఎన్నిక* డిసెంబర్ 11:ఈనెల 13 నుండి 16 వరకు కేరళ రాష్ట్రంలో త్రిస్సుర్ లో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ 35వ జాతీయ మహాసభలకు ప్రతినిధిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ఎన్నికయ్యారు. ఈ మహాసభలు ఎన్నికైన మూడ్ శోభన్ ఆదివారం మాట్లాడారు. మూడేళ్లకు ఒకసారి అఖిల భారత రైతు మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల్లో గత ఉద్యమాలను చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. నేడు వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతాంగం నష్టాల్లో కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పోరేటికరించేందుకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం జరిపిన ఉద్యమ ఫలితంగా ఆ చట్టాలు రద్దు చేయడం జరిగిందని అయినా వ్యవసాయ కార్పొరేటీకరణ ప్రమాదం పోలేదన్నారు. అందుకే కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమ ఫలితంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం, రైతు రుణ విమోచన చట్టం తీసుకురాలేదన్నారు. దేశవ్యాప్తంగా మరో రైతు ఉద్యమానికి అఖిల భారత రైతు మహాసభలు దిశ దశ నిర్దేశించనున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన చారిత్రాత్మకమైన రైతు ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ కోసం జరుగుతున్న అఖిల భారత రైతు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.