
telugu galam news e69news local news daily news today news
అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అధికారుల అండదండలతో చెలరేగిపోతున్న అక్రమార్కులు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఊరుకునేది లేదు- సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి జువారి రమేష్
అనుదినవార్త జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని కొనాయచలం గ్రామ రెవెన్యూ శివారులో ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ 161 /c/2 లో 26 ఎకరాల 22గుంటలు భూమిని ఆక్రమణకు గురైందని సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి జువారి రమేష్ ఆరోపించారు.శనివారం రమేష్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైన భూమిని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టి పట్టనట్టుగా ఉండటంలో ఆంతర్యం ఏమిటో అని ప్రశ్నించారు.అధికారుల తీరు సరైంది కాదని అన్నారు.కోనాయచలం గ్రామ రెవెన్యూ శివారులో ఉన్న భూమిపై గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేయించి భూ పోరాటాలు చేయడం జరిగిందన్నారు.అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకొని కెనాల్ వరద కాలువ మట్టిని తీసుకొచ్చి భూమిలో ఉన్న చిన్న చిన్న కుంటలను లెవెల్ చేయడం జరుగుతున్నదని అన్నారు.ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆక్రమార్కులపై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదన్నారు.రెవెన్యూ అధికారుల అండ దండలతోనే రాజకీయ నాయకులు అక్రమ దారులు ప్రభుత్వ భూముల హద్దులను సైతం పెకిలించి ఆక్రమించుకుంటున్నారని అన్నారు.ఈ ప్రభుత్వంలో నైనా పేదలకు ప్రభుత్వ భూమిని అర్హులైన వారికి పంచాలని అక్రమార్కులపై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పోరాటాలు నిర్వహించి గుడిసెలు వేయించి పేదలకు పంచుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అజ్మీర శ్రీను రాములు రెడ్యా యాకూబ్ భానోత్ రెడ్యా దసురు బాలాజీ శ్రీకాంత్ రూప్ల నాయక్ జోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.