
badrachalam news
అధిక లోడుతో వచ్చే ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ కాగితాలు డ్రైవర్లకు హెవీ లైసెన్సులు ఉన్నాయా…?
అధికారుల్లో చలనం వచ్చేనా…?
కర్ర ట్రాక్టర్స్ డ్రైవర్ల ప్రాణాలకు రక్షణ ఎక్కడ…?
జమెయిల్ సుబాబు కర్ర అధికలోడులతో అటు వాహన దారులకు డ్రైవర్ల ప్రాణాలకు గ్యారెంటీ లేదు…?
ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది…?
అధికారులకు ముడుపులు చెల్లించడం వలన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అని స్థానికుల ఆలోచన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి కంపెనీకి జమాయిల్ సుబాబుల కర్ర అధిక లోడు వేసుకొని సుదూర ప్రాంతాల నుంచి డ్రైవర్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పుల్ల కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం తలకు మించిన బరువు ట్రాక్టర్లకు వేసి రహదారిపై ట్రాక్టర్స్ కి అధిక లోడుతో వస్తున్న క్రమంలో ఎన్నో ఆక్సిడెంట్ లు ట్రాక్టర్లు పల్టీ కొట్టడం వలన ఎంతోమంది డ్రైవర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి వారి కుటుంబాలు వీధిన పడ్డాయి అయినా సరే ఏ ఒక్క అధికారి జమాల్ సుబాబు అధిక లోడులపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి.?
డ్రైవర్లు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన కానీ ఏ ఒక్క అధికారిలో చలనం రాకపోవడం చాలా బాధాకరమని కొందరు సామాజిక కార్యకర్తలు ఆవేదన.?
పుల్ల కాంట్రాక్టర్లు అధిక సంపాదన కోసం ఒక్కో ట్రాక్టర్ కు సుమారు 18 టన్నుల నుంచి 25 టన్నుల వరకు కర్ర లోడ్ చేసి లక్షల రూపాయలు గడిస్తున్నారు అని అనడంలో సందేహమే లేదు.?
అధిక లోడు కు సంబంధించిన అధికారులు ఓవర్ లోడుతో వస్తున్న ట్రాక్టర్ల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పుల్ల టాక్టర్ల ఓనర్స్ వారి ఇష్టానుసారంగా ఎక్కువ టన్నులు లోడు వేసుకొని రోడ్డుపై విన్యాసాలు నాట్యం చేసుకుంటూ ట్రాక్టర్ ని ఐటిసి పేపర్ బోర్డ్ కి డ్రైవర్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేర్చుతున్నారు.
వీరిపై ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పుల్ల కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని సర్వాత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.?
జామాయిల్ సుబాబులు ఓవర్ లోడ్ వేసుకొని వస్తున్న ట్రాక్టర్ల పై పుల్ల కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు పుల్ల కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకి కక్కుర్తి పడటం మూలాన ఎన్నో యాక్సిడెంట్లు ట్రాక్టర్ పల్టీలు కొట్టి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి మరికొందరు కాళ్లు చేతులు విరిగి పోయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అయినా సరే మాకేంటి మాకు అందాల్సినవి మాకు అందుతున్నాయి అన్న రీతిలోనే వ్యవహరిస్తున్న అధికారులు.?
అధికలోడ్ తో వచ్చే కొన్ని ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ ఉండవు? కాగితాలు ఇన్సూరెన్స్ మరికొందరు డ్రైవర్లకు లైసెన్సులు ఉండవు? అదే మరి కొందరు వాహనదారులు టూవీలర్ ఆటోలు ఫోర్ వీలర్స్ కి ఏ ఒక్క కాగితం లేకపోయినా వేల కొద్ది ఫైన్లు వేసే అధికారులు పుల్ల ట్రాక్టర్ల పై కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోరు అంటున్న కొందరు సామాజిక కార్యకర్తలు.?
ఇకనైనా ఓవర్ లోడ్ తో వస్తున్న ట్రాక్టర్లకు పుల్ల కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోకపోతే ఇంకా ఎన్నో ప్రాణాలు పోవచ్చునని అంటున్న కొందరు వాహనదారులు. స్థానిక అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇంత జరుగుతుంది ఇకనైనా పై స్థాయి అధికారులు కలగజేసుకొని అధిక లోడుతో వస్తున్న జామాయిల్ సుబాబు ట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి అంటున్నా స్థానిక ప్రజలు…