
జామే మస్జిద్ నిరసన ర్యాలీకి సంఘీభావం
సత్తుపల్లి జామే మస్జిద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు మణిపూర్ లో మారణకాండ జరుగుతున్న ర్యాలీ లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి పాలన చేస్తోంది. మణిపూర్ ఈ దేశ వాసులు గత 80 రోజులు గా హత్యలు, అత్యాచారాలు, నగ్నంగా స్త్రీలను రోడ్డు మీద నడిపించిన దృశ్యాలు చూసి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనంగా ఉండడం సిగ్గు చేటు. బిజెపి పాలనలో హిందువులు కూడా సంతోషంగా లేరు.రాహుల్ గాంధీ భారత్ జోడో అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. ద్వేషాన్ని వదిలి ప్రేమతో దేశాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. మైనారిటీ వర్గాలకు అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది అని తెలిపారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు