
అక్టోబర్ 2 నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు కలెక్టర్ డిపిఓ లకు జిపి జిల్లా జేఏసీ వినతి~~
జనగామ : రాష్ట్ర ప్రభుత్వం మంత్రి దయాకర్ రావు జిపి కార్మికులను మోసం చేశారని.
34 రోజుల సమ్మె విరమించితే రెండు రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 43 రోజులు గడిచిన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన సమ్మె కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య డిపిఓ కార్యాలయం ఏవో వసంత గార్లకు వినతి పత్రం అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్ రాపర్తి రాజు తెలిపారు
ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు 51 వేల మంది 34 రోజులపాటు సమ్మె అత్యంత జయప్రదంగా జేఏసీ నేతృత్వంలో నిర్వహించడం జరిగిందన్నారు రాష్ట్ర శాసనసభలో శాసనమండలిలో అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వం కోరారని అన్నారు చలో పాలకుర్తి గ్రామపంచాయతీ జేఏసీ నేతృత్వంలో నిర్వహించగా వందలాది మంది పోలీసులతో అంచు వేసి ఎందుకు ప్రయత్నించి రెండు రోజులపాటు జేఏసీ నేతలను కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని మండిపడ్డారు అయినప్పటికీ గ్రామపంచాయతీ జేఏసీ నేతలు ప్రభుత్వం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా సమ్మె వాయిదా వేసి ప్రభుత్వానికి గడువు ఇవ్వడం జరిగిందన్నారు హమి నిలబెట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రి దయాకర్ రావు మాట తప్పారని ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని లేనిపక్షంలో అక్టోబర్ 2 నుండి సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు గ్రామపంచాయతీ కార్మికులు సిద్ధమవుతారని హెచ్చరించారు
ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ పగిడిపల్లి మల్లేష్ బసవ రామచంద్రం నారోజు రామచంద్రం టి యాకుబ్ కృష్ణ సిద్దన్న రాములు వై యాకూబ్ రమేష్ వివిధ మండలాలకు చెందిన జేఏసీ నేతలు పాల్గొన్నారు