-cpm పాదయాత్ర లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు Md అబ్బాస్
———————————*—
కమెళ లో ఉన్న వృత్తి సంఘాలు,కార్మిక సంఘాలు ఐక్య పోరాటానికి కార్యాచరణ కు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు md అబ్బాస్ సూచించారు.నేడు జియగుడ కమెలా లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. దీనిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వృత్తిదారులు,కార్మికులతో మాట్లాడారు. పలు కారణాలతో జియగుడ కమేళా ఆధునీకరణ పనులు ముందుకు సాగటం లేదని కార్మికులు వాపోయారు. ఎండ కాలం లో దుబ్బ,దుమ్ము,ధూళి తో,వర్ష కాలం లో బురద తో నిండి పోతుందని తీవ్ర అసౌకర్యం తో ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పురపాలక శాఖ మంత్రి K.T.R.ఇచ్చిన హామీ అమలు చేయించుకోవటం కొరకు ఇక్కడ ఉన్న వృత్తి సంఘాలు కార్మిక సంఘాలు ఒక ఏకాభిప్రాయం కు వచ్చి పోరాట కార్యాచరణ తో ముందుకు వెళ్లాలని తద్వారా నే కమేల ఆధునిక నిర్మాణం ghmc ఆధ్వర్యం లో జరిగేలా సాధించుకొగలమని అబ్బాస్ పేర్కొన్నారు.
ఈ పాదయాత్ర లో జియగు డ కమే ల స్థానిక నాయకులు V. ప్రమోద్ కుమార్,చుక్కనర్సింహ,స్. శారదా బాయి,శ్రీశైలం,s.మల్లేష్, సీపీఎం జిల్లా నాయకులు G. విఠల్,P. నాగేశ్వర్,శశికళ,కోటయ్య,జంగయ్య,కిషన్, కళ్యాణ్ ,కార్యకర్తలు సత్యమ్మ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.