జిల్లాలో పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరిద్దాం
Uncategorized- జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-
మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ కేసులను తక్షణమే పరిష్కరిద్దామని,సంవత్సరాల తరబడి కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, జైల్లో మగ్గుతున్న ఖైదీలను సకాలంలో కోర్టులో హాజరుపరిచి వారి కేసులను కూడా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుందామని,ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో మహబూబాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఇతర పోలీసు శాఖ అధికారులతో జరిగిన పెండింగ్ కేసుల సత్వర పరిష్కార సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్,ఎక్కువమంది ముద్దాయిలుగా ఉన్న కేసులలో ఒకరిద్దరూ కోర్టుకు హాజరుకాని కారణంగా మిగిలిన వారు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగడం వారి కేసు కూడా పెండింగ్ లో ఉండడం జరుగుతుందని తెలిపారు. అలా జాప్యం కాకుండా చూడాలంటే మిగిలిన ముద్దాయిలను సకాలంలో కోర్టుకు హాజరుపరిచి కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వారు కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయు విధానం పంచనామా రాయు విషయమై తగు సూచలు చేయడం జరిగింది.కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి,జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్,సూపరింటెండెంట్ అమరేందర్,జిల్లా కోర్టు పిపి చిలకమారి వెంకటేశ్వర్లు, ఫోక్సోకోర్ట్ పి పి పద్మాకర్ రెడ్డి, మహబూబాబాద్ తొర్రూరు డివిజన్ల డి.ఏస్.పీ లు,సర్కిల్ ఇన్స్పెక్టర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, కోర్ట్ కానిస్టేబుల్స్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.