
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే పర్యటన జిల్లాలో నలుమూలల కార్యకర్తలు, అభిమానులు,జన సంద్రోహం నడుమ అత్యంత వైభవంగా క్రింది విధంగా సాగింది.
మొదట గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఉదయం:07:30 కి గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణలో క్రీడాకారులకు కావాల్సిన ఆట వస్తువుల పంపిణీ మరియు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత ఎమ్మెల్యే పర్యటన
రేగొండ మండలంలో ఉదయం: 08:00 గంటలకు కొత్తపల్లి (బి) గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శంఖు స్థాపనకార్యక్రమం, మరియు రావులపల్లి గ్రామంలో రూ.10లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఉదయం 9:30 గంటలకు పెద్దంపల్లి గ్రామంలో,
ఉదయం 10:00 గంటలకు భాగిర్తిపేట గ్రామంలో,ఉదయం 11:00 గంటలకు బండపల్లి గ్రామంలో, ఉదయం 11:30 గంటలకు దుంపిల్లపల్లి గ్రామంలో
మధ్యాహ్నం: 12:00 గంటలకు గూడేపల్లి గ్రామంలో,మధ్యాహ్నం 12:30 గంటలకు కోడవటంచ గ్రామంలో,మధ్యాహ్నం 01:00 గంటలకు జోగయ్య పల్లి గ్రామంలో,మధ్యాహ్నం1:30 గంటలకు లింగాల గ్రామంలో
మధ్యాహ్నం 02:30 గంటల కు తిరుమలగిరి గ్రామంలో సీసీ రోడ్లు మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో,ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కనుగాక అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు అందించారు.
గ్రామంలో ఉండే యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని కేసీఆర్ కిట్ లను యువకులకు అందించారు.
ఈ కార్యక్రమలలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.