
జి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గణపురం మండల పరిధిలోని కొండాపురం గ్రామపంచాయతీ చెందిన బిఆర్ఎస్ పార్టీ నేతలు జి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
చేరిన వారి వివరాలు: గ్రామ సర్పంచ్ మామిడి రవి, మార్నేని ఉపేందర్ రావు, మండల సీనియర్ నాయకులు, గొట్టేముక్కల బోజారెడ్డి మండల నాయకులు, చిట్టి మల్ల రవి బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, సల్పాల రవి గ్రామ ప్రధాన కార్యదర్శి ,జాఫర్ మైనార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెరుమాండ్ల నరసయ్య, గ్రామ అధ్యక్షులు కాసర్ల రాజు, మైనార్టీ సభ్యులు సర్దార్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు రామాచారి సీనియర్ నాయకులు ఉపాధ్యక్షులు పిరాల కొమురయ్య వీరితోపాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు