
టి ఫైబర్ కనెక్షన్ పేరుతో తీసిన గుంటలను వెంటనే పూడ్చాలి.
మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఏర్పాటు చేసే టి ఫైబర్ కనెక్షన్ కోసం నరసింహపురంలో ఉన్న మెయిన్ బజార్లో సీసీ రోడ్లను పగలకొట్టి అదేవిధంగా స్కూలు మరియు దేవాలయం తో పాటు. మెయిన్ బజార్లో గుంటలు తీసి నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల గ్రామస్తులు వాహనదారులు ముఖ్యంగా వృద్ధులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు ఆయన మాట్లాడుతూ మెయిన్ బజార్ నుంచే ఎక్కువ రాకపోకలు ఉండటం వల్ల. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బురద మయంగా మారి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్న కారణంగా. గత 15 రోజులుగా సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యము గా. వ్యవహరించడం వల్ల గ్రామంలో ఉన్న సిసి రోడ్లు మరియు మెటల్ రోడ్లు అస్తవ్యస్తంగా మారి స్కూల్ పిల్లలకు దేవాలయానికి వచ్చే భక్తులకు గ్రామస్తులకు. గ్రామంలో నడవాలంటే నరక యాతన పడుతున్నారని. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం. దురదృష్టకరమని సత్యనారాయణ అన్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత గుత్తేదారుతో వెంటనే ఆ గుంటలను పూడ్చి యధావిధిగా ఆ రోడ్లను బాగు చేయించాలని కోరారు.