ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
ఈ69 న్యూస్, గుంతకల్లు.
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టి కోటి కి పైగా సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే, ఈసందర్బంగా కేంద్ర పార్టీ కార్యాలయం నుండి సభ్యత్వం కార్డులు నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ. గుమ్మనూరు జయరామ్ కి అందించారు. గుంతకల్లు శాసన సభ్యులు గుమ్మనూరు జయరామ్ మరియు ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పట్టణం లోని టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలకు సభ్యత్వం కార్డులను పంపిణీ చేశారు.ఈసందర్బంగా గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ పార్టీ కోసం ఎండనక వాననక తిరిగి పార్టీ ని అధికారం లోకి తేవడానికి కృషి చేసిన పార్టీ ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదములని కచ్చితంగా అందరిని గుర్తు పెట్టుకుని వారికి తగిన గుర్తింపునిస్తానని గుమ్మనూరు జయరామ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గుంతకల్లు పట్టణ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.