తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పిగిస్తున్న దృశ్యం ఈ69న్యూస్ ఘనపూర్,జూలై 16:స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఓ 8 ఏళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి డయల్ 100కు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న ఘనపూర్ పోలీసులు బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి,ప్రేమతో మాట్లాడి వివరాలు సేకరించారు.బాలుడు తన పేరు గణేష్,తల్లి పేరు పుష్పలీల అని చెప్పాడు.అతని మాటల ప్రకారం,అదే రోజు ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి ఘనపూర్ రైల్వే స్టేషన్ వద్ద దిగి,లిఫ్ట్ అడుగుతూ నమిలిగొండ చేరుకున్నాడు.అక్కడ చెరువులో ఈత కొట్టి ఆ తర్వాత ఊరిలోకి వెళ్లగా,గ్రామస్తులు అనుమానంతో డయల్ 100కి సమాచారం ఇచ్చారు.అతని పూర్తివివరాలు తెలియకపోయినా,మొబైల్ ఫోన్లో స్కూల్ ప్రాంతం చూపించడంతో పోలీసులు SR నగర్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్నాడని,హైదరాబాద్ దుండిగల్ డబుల్ బెడ్రూం కాలనీ,5వ బ్లాక్లో ఉంటున్నాడని తెలుసుకున్నారు.వెంటనే SR నగర్ మరియు దుండిగల్ పోలీస్ స్టేషన్లతో సంప్రదించి,బాలుడి నివాస వివరాలు ధృవీకరించారు.ఆపై కానిస్టేబుల్ సాయి చరణ్ సారథ్యంలో బాలుడిని హైదరాబాద్కు పంపి,అతని తల్లి పుష్పలీలకు సురక్షితంగా అప్పగించారు.ఈ ఘటనపై స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ స్పందిస్తూ బాలుడి భద్రతకు ముందుగా స్పందించిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.పోలీస్ శాఖ చొరవతో బాలుడిని సురక్షితంగా తిరిగి తన కుటుంబం వద్దకు చేర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.