డబుల్ బెడ్రూంల కేటాయింపు పారదర్శకంగా లేదు
కనీసం 2వ దఫా డబుల్ బెడ్ రూం ల కేటాయింపు జరిపే టప్పుడు ఇటీవల మొదటి దఫా లోజరిగిన పొరపాట్లను గుణపాఠంగా తీసుకోవాలని, కేటాయింపు పారదర్శకంగా ఉండాలని ,లబ్ధిదారులను ఎంపిక చేసేటపుడు మండల తహశీల్దార్ ,జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) హైదరబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం డి అబ్బాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఆయన గోషా మహాల్ నియోజక వర్గం లోని కిషన్ గంజి పార్టీ కార్యాలయం లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశం లో మాట్లాడారు. సొంత ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని ఎర్రజెండా చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఈ నెల 2వ తేదీన మొదటి దఫా కేటాయింపును పరిశీలిస్తే కేవలం 2015-16 సంవత్సరాల్లో అదికూడా మీ సేవ లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఫోన్ లు చేసి విచారిస్తున్నారు. అప్పటి సిమ్ లు ( ఫోన్ నంబర్లు ) వాడకంలో లేకపోతే వారు అనర్హులు అన్నట్లుగా అధికారులు చేస్తున్న విచారణ ఉన్నదని,ఇది పూర్తిగా తప్పుడు పద్ధతిని ఆయన విమర్శించారు. కడు పేదరికంలో ఉన్నవారు మీసేవ దరఖాస్తు రుసుం చెల్లించలేక, లైన్లలో నిలుచోలేక ఉన్నవారు ఎందరో ఆ తర్వాత ఎం అర్ ఓ, కలెక్టర్,మున్సిపల్ ఆఫీస్ లలో దరఖాస్తులు ఇచ్చారు. అంతే కాకుండా, వాంబె, రాజీవ్ గృహకల్ప స్కీం లలో రు.1000- దాకా చెల్లించిన వారున్నారు. వీరందరికీ అర్హుల జాబితా లో చేర్చాలని అప్పుడే నిజమైన పేదలకు కూడా న్యాయం జరుగుతుందని ఆయన ప్రభుత్వ అధికారులకు సూచించారు. అధికారుల వద్దకు చేరిన పాత దరఖాస్తులను అన్నింటినీ వార్డులు/బస్తీల వారీగా విభజించి ఆ లిస్టులను బహిరంగంగా పెట్టీ వారిలో అత్యంత పేదలకు,ఒంటరి మహిళలకు,వికలాంగులకు… తదితరులు ప్రాధాన్యత క్రమంలో బస్తీ సభల్లో నే కేటాయింపు జరపాలని అప్పుడే పారదర్శకoగా ఉంటుందని ఆయన తలిపారు. లేనిచో ఇండ్లు లభించని పేదలతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిలో సి పి ఎం గోషామహల్ నియోజకవర్గ కన్వీనర్ పి.నాగేశ్వర్, సి పి ఎం హైదరబాద్ సౌత్ జిల్లా నాయకులు, ఎల్.కోటయ్య, ఎం.మీన, ఎం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.